ఆరో ద‌శ‌లో పోటీ చేస్తున్న అత్యంత ధ‌నిక అభ్యర్థులు వీరే!

78చూసినవారు
ఆరో ద‌శ‌లో పోటీ చేస్తున్న అత్యంత ధ‌నిక అభ్యర్థులు వీరే!
ఆరో ద‌శ‌ ఎన్నికల్లో పోటీలో ఉన్న అత్యంత ధ‌నిక అభ్య‌ర్థి న‌వీన్ జిందాల్. ఆయన హ‌ర్యానాలోని కురుక్షేత్ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్నారు. ఆయ‌న ఆస్తుల విలువ రూ. 1,241 కోట్లు. ఆ త‌ర్వాత రూ. 482 కోట్ల‌తో ఒడిశాలోని క‌ట‌క్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేడీ అభ్య‌ర్థి సంతృప్త్ మిశ్రా రెండో సంప‌న్నుడిగా నిలిచారు. ఆప్ అభ్య‌ర్థి సుశీల్ గుప్తా రూ. 169 కోట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు.