దేశాన్ని వారు దోచుకోవాలనుకుంటున్నారు: యోగి

58చూసినవారు
దేశాన్ని వారు దోచుకోవాలనుకుంటున్నారు: యోగి
కులం, మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించి దేశాన్ని దోచుకోవాలని INDI కూటమి యోచిస్తోందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆరోపించారు. దానిని తాము జరగనివ్వబోమన్నారు. శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సాకేత్ మిశ్రాకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. 'ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రజలకు సేవ చేస్తోంది. మేము వివక్షను పాటించడం లేదు' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్