ఫ్లెమింగో పక్షులు మొత్తం ఆరు రకాలు ఉంటాయి. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు ఇవి వలస వస్తుంటాయి. కేవలం ఒక కాలిపై మాత్రమే నిల్చోవడం వీటి ప్రత్యేకత. బురద నేలలు, చిత్తడి నేలలు వీటికి ఆవాసాలు. ఏపీ, తమిళనాడు సరిహద్దులోని పులికాట్ సరస్సు, ఒడిశాలోని చిలికా సరస్సు, గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, ముంబయిలోని సెవ్రీ మడ్‌ఫ్లాట్‌లు, పుణె సమీపంలోని భిగ్వాన్ ప్రాంతాల్లో ఇవి తరచూ కనిపిస్తుంటాయి.