TG: చోరీ కేసులో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ దొంగ బ్లేడుతో గొంతు, చేతులు కోసుకున్నాడు. ఈ ఘటన బోరబండ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. బోరబండకు చెందిన థామస్ న్యూ ఇయర్ సందర్భంగా జోగిపేటకు వెళ్లారు. ఈ నెల 7న తిరిగి వచ్చి చూడగా ఇంట్లో దొంగతనం జరిగింది. మహమ్మద్ హాషం అనే దొంగ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని పట్టుకోవటానికి పోలీసులు వెళ్లగా తనకు తాను గాయపర్చుకున్నాడు. పోలీసులు నిందితుడిని ఆస్పత్రికి తరలించారు.