రెండున్నర కోట్ల విలువగల నగలను చోరీచేసిన దొంగలు

55చూసినవారు
రెండున్నర కోట్ల విలువగల నగలను చోరీచేసిన దొంగలు
ఏపీలోని ఏలూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగర కేంద్రంలోని వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన మానేపల్లి మారుతీ రఘురామ్‌ మెయిన్‌బజార్‌లో లోకేశ్వరి జ్యూయలర్స్‌ అండ్‌ బ్యాంకర్స్‌ షాపు అనే షాపు ఉంది. ఆ షాపుకు వెనుక వైపున పాడుబడిన భవనం ఉండడంతో ఇది గమనించిన దొంగలు.. శనివారం రాత్రి గోడకు కన్నం వేసి సుమారు రెండున్నర కోట్ల విలువగల అభరణాలను దొంగలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్