ధనుష్, నయనతార మధ్య వివాదానికి కారణమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘నానుమ్ రౌడీ దానే’. దీనిని ధనుష్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమించుకోవడంతో నయన్ తన డాక్యుమెంటరీలో సినిమాలోని మూడు సెకన్ల వీడియోను వాడుకుంది. దీంతో ధనుష్ లీగల్ నోటీస్ పంపి నష్టపరిహారం కింద రూ.10కోట్లు డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది.