మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకరాం.. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి పెద్దలు డిసెంబర్ రెండో వారంలో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.