కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్ల యజమానుల పేర్లు ప్రదర్శించాల్సిందేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది. ఇదే విషయమై ముజఫర్‌నగర్ పోలీసులు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదానికి దారితీశాయి. అయినా సరే యూపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.