కర్ణాటకలోని బాగల్కోట్లో హెలిప్యాడ్ రోడ్డుపై ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీ (34) తన బంధువైన శృతి (32) వద్దకు వచ్చింది. వీరు స్కూటీపై వెళ్తూ వేగంగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రజనీ, శృతితో పాటు బైకర్ అభిషేక్ (20) కూడా చనిపోయాడు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.