స్కూటర్‌ను ఢీకొట్టి వ్యాపారి నుంచి రూ.8.5 లక్షలు దోపిడీ చేసిన ముగ్గురు వ్యక్తులు (వీడియో)

551చూసినవారు
ఓ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు పట్టపగలే దోచుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరీనాలోని పరాగ్‌ ఆయిల్‌ మిల్‌ సమీపంలో జరిగింది. పొగాకు వ్యాపారి రాజేంద్ర ప్రసాద్ గుప్తా రూ.8.5 లక్షల నగదుతో తన స్కూటర్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దొంగలు అతని వాహనాన్ని ఢీకొట్టగా, ఆయన పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. వెంటనే అతని వద్ద ఉన్న నగదు బ్యాగును ఆ ముగ్గురూ లాక్కొని పారిపోయారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది.

సంబంధిత పోస్ట్