మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో శనివారం మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను రక్షించగా ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాస్ షిండే తెలిపారు.