నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి (వీడియో)

1083చూసినవారు
రాజస్థాన్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జలోర్ జిల్లాలోని పోసానా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం గాయపడిన కార్మికుడిని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్