చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకుల గల్లంతు

56చూసినవారు
చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకుల గల్లంతు
విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద చెక్‌డ్యామ్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. గోస్తనీ నది చెక్‌డ్యామ్‌లో మంగళవారం ఉదయం ఈత కోసం ఆరుగురు యువకులు వచ్చారు. వీరిలో ముగ్గురు గల్లంతు కాగా.. మిగతావారు ఒడ్డుకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులను విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన అశోక్‌(19), షాకిత్‌(16), రజిక్‌(14)గా గుర్తించారు.