అంటార్కిటికాలో దాదాపు 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న భారీ మంచుకొండకు పగుళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది. ఢిల్లీ నగర వైశాల్యంతో పోల్చితే 4 రెట్లు ఉండే ఈ మంచుకొండను సైంటిస్టులు ఏ-83గా పేర్కొంటున్నారు. మే 20న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ‘కకోపర్నికస్ సెంటినల్-1’ శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. త్రిభుజాకారంలో ఉన్న ఏ-83 మంచుకొండ మే 22నాటికి పూర్తిగా చీలిపోయినట్టు శాటిలైట్ విడుదల చేసిన రాడార్ చిత్రాలు చెబుతున్నాయి.