యునెస్కో వార‌స‌త్వ సంప‌ద జాబితాలో అహోమ్ చ‌క్ర‌వ‌ర్తుల స‌మాధులు

60చూసినవారు
యునెస్కో వార‌స‌త్వ సంప‌ద జాబితాలో అహోమ్ చ‌క్ర‌వ‌ర్తుల స‌మాధులు
అస్సాంలో ఉన్న చ‌రాయిడియో మైద‌మ్ స‌మాధి క‌ట్ట‌డాల‌ను యూనెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ జాబితాలో చేర్చారు. క‌ల్చ‌ర‌ల్ ప్రాప‌ర్టీ క్యాట‌గిరీలో ఆ ప్రాంతాన్ని చేర్చారు. ఈజిప్టు పిర‌మిడ్స్ త‌ర‌హాలో.. తూర్పు అస్సాంను పాలించిన అహోమ్ చ‌క్ర‌వ‌ర్తులు ఇక్క‌డ త‌మ స‌మాధుల‌ను ఏర్పాటు చేశారు. చ‌రాయిడియో మైద‌మ్‌ను చ‌క్ర‌వ‌ర్తులు ఖ‌న‌న ప్ర‌దేశంగా పిలుస్తారు. అయితే ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ ప్రాంతం యూనెస్కో గుర్తింపు పొందడం ఇదే మొద‌టిసారి.

సంబంధిత పోస్ట్