ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్‌లోని కేద్రుపూర్ గ్రామంలో మనోజ్ పాఠక్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అతడి భార్య గుంజన్ కూడా గుండెపోటుతో మృతి చెందింది. వారికి ఇద్దరు ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. వారి మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇద్దరి అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు.