తెలంగాణలో వైన్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రూపొందించిన సాఫ్ట్ వెర్ లో టెక్నికల్ ప్రాబ్లెమ్స్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డిపోల నుంచి దుకాణాలకు లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, వైన్ షాపుల్లోనూ స్టాక్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ పలు షాపుల్లో నచ్చిన బ్రాండ్లు దొరకడం లేదని మందుబాబులు ఆవేదన చెందుతున్నారు.