హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలోని గుర్రంగూడ ఎక్స్ రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి అక్కడే ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు వనస్థలిపురంకు చెందిన కుంచల రవి, మీర్పేట్కు చెందిన బొల్లం ప్రణయ్ గా గుర్తించారు. చనిపోయిన ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. ఈ ప్రమాదంలో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి.