ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

61చూసినవారు
ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
TG: ప్రియుడి వేధింపులు భరించలేక ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HYD మల్లాపూర్‌‌కు చెందిన పూజిత (21) ఇంద్ర చరణ్‌రెడ్డి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెలరోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. అయితే గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ చరణ్ రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో మనస్తాపానికి గురైన పూజిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్మకు చేసుకుంది. పోలీసులు యువకుడిని రిమాండ్‌కు తరలించారు.