AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు మంజూరు చేసే పథకాన్ని పొడిగించింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి జీవో జారీ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హైల్పర్ల కుటుంబానికి ఈ మొత్తం సొమ్మును చెల్లించనున్నారు.