గుడ్ న్యూస్: రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ

78చూసినవారు
గుడ్ న్యూస్: రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ
AP: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గతేడాది మే నెలలో ఈదురుగాలు, వర్షాలతో రైతుల పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పంటలు దెబ్బతిన్న 2,856 మంది రైతులకు రూ.4.32 కోట్లు విడుదల చేసింది. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. రైతులకు వరుస క్రమంలో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు. అలాగే పశువులకు దాణా పంపిణీ చేసిన ఫెర్టైల్ గ్రీన్ సంస్థకు రూ.2.13 కోట్ల బకాయిలు విడుదల చేసింది.
https://x.com/LokalAppTelugu

సంబంధిత పోస్ట్