ఇస్రో వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి GSLV-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్.. NVS-02 ఉపగ్రహాన్ని తీసుకొని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం.. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలందించనుంది.