పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభజనను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సోమవారం రూల్ 185 కింద అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానం గురించి సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తాము నమ్ముతామని, అయితే రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని అన్నారు.