వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్‌

79చూసినవారు
వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్‌
కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ లు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి సుకంత మజుందార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన సిగ్గుచేటని, సమగ్ర దర్యాప్తును చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని అన్నారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్