పాకిస్థాన్‌‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

79చూసినవారు
పాకిస్థాన్‌‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం అంతమైందని, ఇలాంటి ఘటనలు మళ్లీ కొనసాగితే పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేయక తప్పదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే భయాందోళనకు గురి చేయడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్