భారత్‌లో వాతావరణ పరిస్థితులు అసాధారణ రీతిలో మార్పు చెందినట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తెలిపింది. ఈ మేరకు ‘క్లైమేట్ ఇండియా 2024’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. వందేళ్లకోసారి వచ్చే మార్పు ఐదేళ్లలోనే సంభవిస్తోందని పేర్కొంది. దీంతో భారత్‌లో ఇప్పటివరకు 3,238 మరణాలు, 32 లక్షల హెక్టార్లలో పంట నష్టం, 2.35 లక్షలకు పైగా ఇండ్లు దెబ్బతిన్నట్లు పేర్కొంది.