భారత్‌లో యూపీఐ చెల్లింపులు నోట్ల రద్దు తర్వాత భారీగా పెరిగాయి. అయితే చెల్లింపులు చేయడానికి ఇంటర్నెట్ కచ్చితంగా కావాల్సిందే. కాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపులను అనుమతించే విధంగా కొత్త ఫ్యూచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ సేవలను అధికారిక యూఎస్‌ఎస్‌డీ సర్వీస్ ఉపయోగించి యూపీఐ సేవలను పొందవచ్చు. *99# డయల్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు నిర్వహించవచ్చు.