ఓ తండ్రి తన కొడుకుకి పెళ్లి చేయాలనుకున్నాడు. ఓ అమ్మాయిని చూశాడు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. తీరా పెళ్లి రోజు దగ్గర పడేసరికి తానే.. కాబోయే కోడలిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొడుకుకి షాకిచ్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటు చేసుకుంది. తామిద్దరం ప్రేమలో పడ్డామని, అందుకే పెళ్లి చేసుకున్నామని కొడుకుకి తండ్రి చెప్పాడు. దాంతో ఆ కొడుకుకి తండ్రిపై విపరీతమైన అసహ్యం కలిగింది. తనకింకా పెళ్లే వద్దనుకున్నాడు. చివరకు సన్యాసిగా మారి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు.