కాంగ్రెస్ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ప్రారంభానికి సిద్ధమైంది. న్యూఢిల్లీలోని కోట్ల రోడ్‌లోని 9A వద్ద ఉన్న తమ కొత్త ప్రధాన కార్యాలయం ఇందిరా గాంధీ భవన్‌ను జనవరి 15న ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నట్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభించనున్నారు.