వాలంటైన్స్ డేను పురస్కరించుకొని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కీలక వ్యాఖ్యలు చేశాయి. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే ను నిషేధించాలని పేర్కొన్నాయి. ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డం పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం సరికాదన్నారు. ప్రేమ ముసుగులో విస్తృంకల చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్లు తెరిచి మంచి బుద్ధితో వ్యవహరించాలని, దేశ సేవకు ముందుకు రావాలని సూచించారు.