ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త భారీ ధర పలికింది. బ్రెజిల్‌లో ఇటీవల మేలు జాతి పశువుల వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41కోట్ల ధర పలికింది. ఈ క్రమంలో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ఒంగోలు గిత్తలు బలానికి ప్రసిద్ధి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.