స్కూటీలు ఇవ్వాలంటూ విద్యార్ధినుల పోస్టు కార్డ్ ఉద్యమం

59చూసినవారు
TG: మాకు స్కూటీలు ఇవ్వాలంటూ విద్యార్థినులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా స్కూటీ గ్యారంటీ అమలు చేయలేదని.. తాము ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ప్రియాంకా గాంధీకి విద్యార్థినులు లేఖలు రాస్తున్నారు. తమ డిమాండ్‌లను తీర్చాలని విద్యార్థినులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్