VIDEO:కుక్కను వంతెనపై నుంచి నదిలో విసిరేశాడు

67చూసినవారు
జంతువుల పట్ల కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జంతువులను హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇదే కోవలో ఉత్తరాఖండ్‌లో బాసిత్ అలీ అనే వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించాడు. కర్రల వంతెనపై ఓ కుక్కను నిందితుడు దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత వంతెనపై నుంచి నదిలోకి విసిరేశాడు. దీనిని వీడియో తీసి నిందితుడు సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతోంది. అతడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్