టీడీపీ తరఫున మూడోసారి ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో పార్లమెంటులో తమకు మాట్లాడటానికి ఇంకాస్త సమయం కావాలని అడిగిన ఎంపీ రామ్మోహన్.. ‘వచ్చేసారి పార్లమెంట్‌కు తమ పార్టీ ఎక్కువ మెజారిటీతో వస్తుందని, అప్పుడు సమయం గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని గట్టిగా చెప్పారు. తన సంకల్ప బలం, ప్రజల ఆశీర్వాదంతో రామ్మోహన్ ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు.