గత సర్కారు దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని మాట తప్పింది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించింది. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పోయి.. వచ్చే నెల నుంచి ప్రైవేటు వ్యక్తులే మద్యం విక్రయాలు చేపట్టనున్నారు. దీంతో విచ్చలవిడిగా మద్యం దొరికే అవకాశం కనిపిస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మందు బాబులు ఇష్టారాజ్యంగా సేవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.