ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి సేవలు అందించనుంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి కొలతలు తీసుకుంటారు. ఒకే రోజులోనే కృత్రిమ అవయవాలను తయారు చేసి అందిస్తారు.