తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాలల ప్రారంభం రోజే రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా ఝులిపించారు. బస్సుల కండీషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు.