కొంతమంది పిల్లలు బొమ్మల వేషం ధరించి వీధిలో డాన్స్ చేస్తుంటారు. ఇలా వారంతా డాన్స్ చేయడం చూసి దూరంగా చెట్టుపై ఉన్న పావురం కిందకు దిగి మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులు వేస్తుంది. పావురం డాన్స్ వేయడంతో పిల్లలు కూడా మరింత ఉత్సాహంగా డాన్స్ వేస్తుంటారు. ఇలా ఆ పావురం చాలా సేపు అక్కడే డాన్స్ వేస్తుంటుంది. పావురం డాన్స్ వేయడాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.