కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హరిచందన గురువారం కొడంగల్ మున్సిపల్ పరిధిలో పర్యటించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం కోడంగల్ కావడంతో భవిష్యత్తులో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా ఆమెను కలిసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.