కోస్గి పట్టణంలో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసం కావడంతో మురుగునీటితో పాటు వర్షపు నీరు రోడ్లపై నిలుస్తోంది. తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.