ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

50చూసినవారు
ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
పోచమ్మ తల్లి అనుగ్రహం వల్ల గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పురోహితుడు శేషాద్రి రావు అన్నారు. మండల పరిధిలోని లింగన్ పల్లి గ్రామంలో బుధవారం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, బోనాలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో పూజారి శేషాద్రి రావు ఘనంగా విగ్రహప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలతో మొక్కులు సమర్పించుకున్నారు.

ట్యాగ్స్ :