
గండీడ్: జాగ్రత్త.. కొనసాగుతున్న రహదారి పనులు
గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో జాతీయ రహదారి నెంబర్-167 ప్రధాన రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులు, వాహనదారులు రాత్రి సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని శుక్రవారం అధికారులు సూచించారు. మొత్తం రూ. 706. 08 కోట్ల వ్యయంతో 108 కిలోమీటర్ల రహదారిని మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు నిర్మిస్తున్నారు.