ఘనంగా మొహరం వేడుకలు

78చూసినవారు
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో బుధవారం మొహరం పండుగ సందర్భంగా పీర్ల ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది. గ్రామంలోని ప్రజలు, భక్తులు కుల మతాలకు అతీతంగా ఉత్సాహంగా మొహరం వేడుకల్లో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో గ్రామంలో ఐక్యమత్యం పెంపొందుతుందని పలువురు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్