ఏపీకి ఓటర్లు.. బస్సు ఛార్జీల బాదుడు

51చూసినవారు
ఏపీకి ఓటర్లు.. బస్సు ఛార్జీల బాదుడు
మే 13వ తేదీ ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటు వేసేందుకు నగరవాసులు సొంతూళ్ళకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఏపీకి పయనమవుతున్న ఓటర్లకి బస్సు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సైతం ప్రత్యేకబస్సులు ఏర్పాటు చేసింది. అయితే ఈ బస్సుల్లో, రైళ్లల్లో సీట్లు నిండిపోగా.. ప్రజలు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. వారు దొరికిందే సందు అని దోచుకుంటున్నారు.