వైన్ షాప్ లో వ్యక్తిపై గొడ్డలితో దాడి
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలోని ఓ వైన్స్ లో మంగళవారం రాత్రి వ్యక్తిపై దాడి జరిగింది. పర్మింట్ రూంలో మందు తాగుతున్న కురుమయ్యపై గొంగడి కప్పుకొని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. తల, మెడ, వీపుపై దాడి చేయడంతో కుప్పకూలాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఎస్ఐ హరిప్రసాద్ తన కారులో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.