భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గ జిల్లా, రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలను మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని కోరారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు.