జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న నాయకపోడ్ల సమస్యల మీద ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘము భూపాలపల్లి డివిజన్ కమిటీ అధ్యర్యంలో పలు సమస్యలు మీద ఏటూరునాగారంఐ టి డి ఎ పి ఓ శ్రీ అంకిత్ ఐఏఎస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాయకపోడ్ ల ఆరాధ్య దైవం అయినా లక్ష్మి దేవర గుడికి మరియు కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. ఉమ్మడి పాత కరీంనగర్ జిల్లా నుండి 5 మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలవడం జరిగింది. గతంలో మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆదివాసీల అభివృద్ధి కోసం ఒక మాడ ఆఫిస్, గిరిజన అభివృద్ధి అధికారి ఉండేవారు దానిని ప్రస్తుతం ఎత్తివేశారు. దాని వలన ఆదివాసీలు అభివృద్ధికి ఆమడదురంలో ఉన్నారు కావున అత్యధికముగా ఆదివాసులు ఉన్న కేంద్రం అయినా మహాదేవపూర్లో మాడ ఆఫిస్ ను వెంటనే పునరుద్దరించాలని కోరడమైనది. మరియు చిట్యాల మండలంలో ఆదివాసీ విద్యార్థులు చదువుకోవాలంటే సూదురా ప్రాంతాలకు పోవలసి వస్తుంది కావున ఆదివాసులు ఎక్కువగా ఉన్న నైన్ పాక గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాల నెలకొల్పాలని, మరియు ఈ సంవత్సరం అధిక వర్షాలు వరదలు కారణంగా ఆదివాసులు ఎక్కువగా నివాసం ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఇండ్లు, పంటలు, పంట భూములలో తీవ్ర నష్టం జరిగింది. నష్ట పోయినవారందరిని ఆదుకోవాలని, పోడు భూములు సర్వేలో ఏ ఒక్క ఆదివాసీ కుటుంబం నష్ట పోకుండా సర్వే చేసి అర్హులైన వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బద్ది సమ్మయ్య, ఎంపీటీసీ బొడ్డు సమ్మయ్య, సంఘము గౌరవ అధ్యక్షులు ముంజం సారయ్య, డివిజన్ అధ్యక్షులు కల్నేని సాంబయ్య, ప్రధానకార్యదర్శి పెద్ది పోషయ్య, బిముని శరత్, త్రిజేసి వెంకట్రాజం బిముని సారయ్య, మేకల తిరుపతి, గంప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.