పిఏసీఎస్ చైర్మన్ సస్పెన్సన్..?

2002చూసినవారు
పిఏసీఎస్ చైర్మన్ సస్పెన్సన్..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చెప్యాల రామారావు సస్పెన్షన్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా చైర్మన్ తో పాటు పిఏసీఎస్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల అమ్మకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా పలువురు రైతుల ధాన్యం సొమ్మును తమ వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసుకున్నట్లుగా అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా డిసిఓ కార్యాలయ అధికారులు విచారణ చేపట్టగా తాడిచర్ల సొసైటీలో భారీగా అక్రమాలు జరిగినట్లుగా తేలడంతో ఇటీవల 51 విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విస్తృతంగా విచారణ జరిపిన నేపథ్యంలో ప్రస్తుత డైరెక్టర్, చైర్మన్ ను పదవి నుండి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఐతే ఈ విషయం పై భూపాలపల్లి డిసిఓ ను ఫోన్ లో సంప్రదించగా తమకు ఏలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. కాగా ఈ విషయం పై బాధితుడు కోర్టు మెట్లు ఎక్కినట్లుగా తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్