డోర్నకల్: మరో 30 సంవత్సరాల పాటు నియోజకవర్గంలోనే ఉంటా

74చూసినవారు
డోర్నకల్: మరో 30 సంవత్సరాల పాటు నియోజకవర్గంలోనే ఉంటా
మహబుబాబాద్ జిల్లా కురవిలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి నావెంట ఎందరు ఉంటారో ఎవరు పోతారో అని నాకు తెలుసు, పది సంవత్సరాలు కష్టాల్లో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటానని, సాద్యమైనమేర పదవులు ఇస్తామని చెప్పారు.