Feb 27, 2025, 00:02 IST/ములుగు
ములుగు
ములుగు: రామప్ప దేవాలయంలో ఘనంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం
Feb 27, 2025, 00:02 IST
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయంలో రామలింగేశ్వరస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముహూర్తం సమయానికి పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరిపించారు. ముందుగా మంత్రి సీతక్క స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బుధవారం రాత్రి 11 గంటలకు కళ్యాణం జరిపించారు. అనంతరం తలంబ్రాలు అక్షింతలు వేసి ఘనంగా నిర్వహించారు.